Header Banner

ఏపీలో రెండు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాకు ఆరెంజ్ అలర్ట్!

  Mon May 19, 2025 22:06        Politics

ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ ప్రాంతంలో రానున్న రెండు రోజుల పాటు పలుచోట్ల పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. రానున్న రెండు రోజుల్లో రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడతాయని, ఈ సమయంలో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉందని కూర్మనాథ్ పేర్కొన్నారు.

 

ఇది కూడా చదవండి: తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. రాష్ట్రంలో 77 మంది ఐపీఎస్‌ల బదిలీ!

 

ముఖ్యంగా రేపు (మే 20) తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, వైఎస్ఆర్, అన్నమయ్య, శ్రీ సత్యసాయి, అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అనేక చోట్ల భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని వివరించారు. ఇదే సమయంలో విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, ఉభయ గోదావరి జిల్లాలు, కోనసీమ, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. వర్షాల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తూ, హోర్డింగ్‌ల కింద, చెట్ల కింద, శిథిలావస్థలో ఉన్న గోడలు, పాత భవనాల దగ్గర నిలబడవద్దని హెచ్చరించారు. వర్షాలతో పాటు రాష్ట్రంలో కొన్ని చోట్ల ఉష్ణోగ్రతలు కూడా 38 డిగ్రీల సెల్సియస్ నుంచి 40 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉందని కూర్మనాథ్ వెల్లడించారు. వాతావరణ మార్పులను గమనిస్తూ, ప్రభుత్వ సూచనలను పాటించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

 

ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవులపై జోరుగా చర్చలు.. మరో జాబితా లిస్ట్ రెడీ! చంద్రబాబు కీలక సూచన - వారిపై ఎక్కువ దృష్టి!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నారా రోహిత్​పై కిడ్నాప్​ ఆరోపణలు! సీఎంకు కంప్లైంట్​ చేస్తానన్న మంచు మనోజ్!

 

శ్రీశైలం ఆలయం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్పై వేటు! ఘటన వెలుగులోకి రావడంతో..

 

బాంబు పేలుళ్ల కుట్ర భగ్నం..! వెలుగులోకి సంచలన విషయాలు!

 

ఏపీలో త్వరలోనే నంది అవార్డులు! సినిమాలతో పాటు నాటక రంగానికి..!

 

అమెరికా ప్రయాణికుల‌కు కీలక హెచ్చరిక! గడువు దాటితే తీవ్ర పరిణామాలు! శాశ్వత నిషేధం కూడా..

 

హర్భజన్ పై మండిపడుతున్న కోహ్లీ ఫ్యాన్స్.. సోషల్ మీడియాలో దుమారం!

 

గుల్జార్‌హౌస్‌ ప్ర‌మాద ఘ‌ట‌న‌పై స్పందించిన మోదీ, ఏపీ సీఎం! మృతుల కుటుంబాల‌కు ప‌రిహారం ప్ర‌క‌ట‌న‌!

 

ఏపీలో సీనియర్ సిటిజన్లకు బంపరాఫర్.. సర్కార్ కీలక నిర్ణయం! వాట్సాప్ ద్వారానే - అస్సలు మిస్ కాకండి!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Rain #AndhraPradesh #APSDMA #Weather #CycloneDana